మేకలు, గొర్రెలపై విస్తృత పరిశోధనలు జరగాలి.. ఉడుత రవీందర్

by Javid Pasha |
మేకలు, గొర్రెలపై విస్తృత పరిశోధనలు జరగాలి.. ఉడుత రవీందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మేకలు, గొర్రెలపై విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదని గొర్రెలు, మేకలపెంపక దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లా ఫరాలోని కేంద్ర మేకల పరిశోధనా కేంద్రం అధ్వర్యంలో మార్చి 16,17 రెండు రోజులు నిర్వహించిన మేకల ప్రదర్శన కార్యక్రమంలో ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున గొర్రెలు, మేకల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

విస్తృత మేపు పద్ధతి (బయట మేపడం)లో జీవాలను పెంచుతుండటంతో ప్రస్తుతం మేత భూములు తగ్గిపోయి జీవాల మేతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దీనినుండి రక్షించుకునేలా పాక్షిక సాంద్ర పద్ధతిలో మేపుకునేలా ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు పెంపకందారులను చైతన్యం చేయాలన్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నపిల్లలకు పౌష్ఠికాహారం ఇస్తున్నట్లు జీవాలకు కూడా దాణా, మినరల్ మిక్సర్ లాంటివి అందించాలని కోరారు. మేకలలో వచ్చే డెక్కవాపు, దొబ్బరోగం లాంటి వ్యాధికి సంబంధించిన టీకాలు వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Next Story

Most Viewed