విషాదం.. లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

by GSrikanth |
విషాదం.. లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి
X

దిశ, ములుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం లక్నవరం సరస్సు అందాలను చూడడానికి హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు(ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) లక్నవరం చెరువులోని ఐలాండ్ వద్దకు వెళ్లి సరదాగా గడుపుతున్న సమయంలో లోతు అంచనా వేయకుండా నీటిలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించాయి.


Next Story

Most Viewed