TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త.. ఇక పండగ చేస్కోండి

by Shiva |
TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త.. ఇక పండగ చేస్కోండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభ‌వార్త చెప్పింది. ఇక నుంచి దూర ప్రాంతాలకు లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో ప్రయాణించే వారికి బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. అయితే, లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉన్నాయి. అదేవధంగా లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరి ఖని నుంచి బెంగళూరు, కరీంనగర్ నుంచి బెంగళూరు, నిజామాబాద్ నుంచి తిరుపతి, నిజామాబాద్ నుంచి బెంగళూరు, వరంగల్ నుంచి బెంగళూరు రూట్లలో అందుబాటులో ఉండనున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story