- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TSPSC : పేపర్ లీకేజ్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపింది. ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అని సిట్ తెలిపింది. ఇప్పటి వరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది.
నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులని, 19 మంది సాక్ష్యులను విచారించినట్లు స్పష్టం చేసింది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ యజమాని, ఉద్యోగిని సాక్షిగా సిట్ విచారణలో తెలిపింది. హోటల్‌లోని యజమాని, ఉద్యోగిని సాక్షిగా సిట్ విచారణలో తేల్చింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ ని ప్రధాన సాక్షిగా సిట్ పేర్కొంది.
Next Story