- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TSPSC Group-3 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-3 ఫలితాలు విడుదల

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రూప్-3 (Group-3) ఫలితాలు విడులయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (General Ranking List) జాబితాను కూడా టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,365 గ్రూప్-3 సర్వీస్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు పేర్కొన్నారు. కాగా, చెప్పినట్లుగానే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1 ఫలితాలు, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఇవాళ తాజాగా గ్రూప్-3 జనరల్ ర్యాంకు జాబితా విడుదలైంది. గ్రూప్-3 సర్వీస్ పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాత పరీక్షకు మాత్రం 50.24 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.