TSPSC కేసు : పదో తరగతి ప్రశ్నకు నీళ్లు నమిలిన టాపర్

by Sathputhe Rajesh |
TSPSC కేసు : పదో తరగతి ప్రశ్నకు నీళ్లు నమిలిన టాపర్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఏఈఈ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి షాకిచ్చాడు. పరీక్షలో టాపర్ల జాబితాలో ఉన్న సదరు అభ్యర్థి పదో తరగతి పిల్లలు సైతం టక్కున జవాబు చెప్పే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ అధికారులు గ్రూప్1, ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో టాప్ మార్కులు సాధించిన అభ్యర్థులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఈఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఓ అభ్యర్థిని సిట్ అధికారులు (ఏ+బీ)2 ప్రశ్నకు జవాబు చెప్పామన్నారు. అయితే, సదరు అభ్యర్థి నాకు సమాధానం తెలియదని చెప్పటంతో సిట్ అధికారులు బిత్తర పోయినట్టు సమాచారం. మరో ఇరవై ప్రశ్నలు అడుగగా అభ్యర్థి రెండింటికి కూడా జవాబు చెప్పలేదని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed