గుడ్ న్యూస్: గర్భిణీ అభ్యర్థులకు TSLPRB కీలక ప్రకటన..

by Satheesh |   ( Updated:2022-12-27 15:03:11.0  )
గుడ్ న్యూస్: గర్భిణీ అభ్యర్థులకు TSLPRB కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ఎల్‌పీర్బీ గర్భిణీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో పాసైన గర్భిణీ అభ్యర్థులకు ప్రస్తుతం ఈవెంట్స్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. గర్భిణీలు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులు బాటు కల్పించినట్లు బోర్డు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీ స్త్రీలు నెల రోజుల్లోగా ఈవెంట్స్‌లో పాల్గొనాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోలీస్ అభ్యర్థులకు దేహాదారుడ్య పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.


Next Story