- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS Weather: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. అత్యధికంగా టెంపరేచర్ ఆ ప్రాంతంలో నమోదు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రెండు, మూడు రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో జన జీవనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మే నెల సమీపిస్తుండటంతో రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ పరిణామంతో జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. ఇక చిన్నారులు, ముసలి వాళ్ల పరిస్థితి చెప్పరాకుండా ఉంది. రాష్ట్రంలోని భద్రాచలంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40.2, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా రామగుండంలో 39.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 38.8 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో రెండు వారాలు గిడిస్తే 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.