పారదర్శకంగా గొర్రెల పంపిణీ.. రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్

by Javid Pasha |
పారదర్శకంగా గొర్రెల పంపిణీ.. రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పారదర్శకంగా గొర్రెల పంపిణీ చేపడుతున్నామని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ స్పష్టం చేశారు. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా బాలరాజుయాదవ్ మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపికలోనూ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మటన్ క్యాంటిన్, మటన్ మార్కెట్ ప్రారంభానికి సిద్ధమవుతున్న నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలోజీఎంపీఎస్ గౌరవ అధ్యక్షుడు కాసాని ఐలయ్య, అధ్యక్షుడు కిల్లె గోపాల్, ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, వివిధ జిల్లాల కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story