ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

by GSrikanth |
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. మార్చి 6వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. మార్చి 13న నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న నామినేషన్ల పరిశీలన, మార్చి 23న పోలింగ్, అదేరోజు కౌంటింగ్ జరుగనుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న నవీన్ రావు, గంగాధర్ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డిలు పదవీ విరమణ చేయనున్నారు.

Advertisement

Next Story