- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో: ఎంబీఎ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మంగళవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 550, మిగతా కేటగిరీ వారికి రూ. 750 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 250 ఆలస్య రుసుంతో మే 12 వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 12 నుంచి 18వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 22 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26,27 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఐసెట్ ఎగ్జామ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 75 సెంటర్లు ఏర్పాటు చేశారు. జూన్ 20న ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు.