- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు అభివృద్ధి జరిగింది ఆ సమయంలోనే: కూసుకుంట్ల
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం రంజుగా మారింది. తాజాగా.. బైపోల్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2018 వరకే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే డిండి ఎత్తిపోతలతో పాటు రూ.600 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు చేశామని అన్నారు. ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలడానికి మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నుంచే ప్రారంభించామని తెలిపారు. 2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేశారని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీకి మూడో స్థానం ఖరారైపోయిందని జోస్యం చెప్పారు.