- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: మారని ఆర్టీసీ సిబ్బంది తీరు.. ఏకంగా జర్నలిస్టుల బస్‌పాస్‌లు లాక్కుంటామని దౌర్జన్యం
దిశ, వెబ్‌డెస్క్: మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి టీజీఎస్ ఆర్టీసీ తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ఓ వైపు ప్రయాణికులతో స్టాఫ్ గొడవలకు దిగుతూ నిత్యం ఎక్కడో ఒకచోట వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు కండక్టర్లు జీరో టికెట్ల మాటున పురుషులకు టికెట్లు ఇస్తూ.. సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఘటన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల అహంకారానికి పరాకాష్టగా నిలిచింది. హనుమకొండలో ఓ యువ జర్నలిస్టు తన కూతురికి ఉరేసి, తాను కూడా ఉరేసుకుని బలవ్మరణానికి పాల్పడ్డాడు. అయితే, జనగామలో జరిగే అంత్యక్రియలకు హజరయ్యేందుకు ఓ నలుగురు జర్నలిస్టులు హనుమకొండలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.
దీంతో డ్రైవర్, కండక్టర్ ఒక్క బస్సులో ఇలా ఎంతమంది ఎక్కతారంటూ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వెంటనే బస్సులోంచి దిగిపోవాలని హుకూం జారీ చేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. మీ ఇష్టం ఉన్నోళ్ల దగ్గర చెప్పుకోండంటూ కండక్టర్ బెదిరించాడు. బస్సు పాస్‌లు లాక్కొని డిపోలో అప్పజెబుతాం.. అక్కడ తేల్చుకుందాం పదా అంటూ కామెంట్ చేశారు. ప్రజా శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ.. సమిధలవుతోన్న జర్నలిస్టుల పట్ల ఆర్టీసీ సిబ్బంది అమర్యాద ప్రవర్తించడం సరికాదని పలు జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఘటనకు కారణమైన డ్రైవర్, కండక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత జర్నలిస్టులు ఆర్టీసీ ఎండీ, ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://youtu.be/reiuGvX35WE