Transfers: రాష్ట్రంలో భారీగా ఎస్పీలు, అడిషినల్ ఎస్పీలు బదిలీ.. ఉత్తర్వులు జారీ

by Shiva |
Transfers: రాష్ట్రంలో భారీగా ఎస్పీలు, అడిషినల్ ఎస్పీలు బదిలీ.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసు శాఖలో బదీలీ పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని నాన్ కేడర్ ఎస్పీలు, అడిషినల్ ఎస్పీని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ గురువార రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా దారా కవిత, మల్కాజ్‌గిరి-భువనగిరి ఎస్‌వోటీ డీసీపీగా రమణారెడ్డి, ఆక్టోపస్ ఎస్పీ అడ్మిన్‌గా ఎం.వెంకటేశ్వర్లు, తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సునీతా మోహన్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సాయి శేఖర్, అదనపు ఎస్పీగా వినోద్ కుమార్‌ను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story