బయటపడిన రాక్షస గుహల ఆనవాళ్లు.. క్రీ.పూ 4 వేల ఏళ్ల నాటివిగా గుర్తింపు..

by Sumithra |
బయటపడిన రాక్షస గుహల ఆనవాళ్లు.. క్రీ.పూ 4 వేల ఏళ్ల నాటివిగా గుర్తింపు..
X

దిశ, ఫీచర్స్ : చారిత్రక కట్టడాలకు, శిల్పకళా సంపదకు, ప్రకృతి అందాలకు, బౌద్ధమత, కాకతీయ ఆనవాళ్లకు నిలయం నల్లగొండ జిల్లా. అంతేకాదు ఈ జిల్లాలో రాతియుగం, మధ్యయుగానికి చెందిన ఆనవాలు ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో క్రీ.పూ నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి బృహత్‌ శిలాయుగానికి చెందిన ఆదిమానవులకు సంబంధించిన రాక్షస గుహ ఒకటి వెలుగుచూసింది.

ఇదిలా ఉంటే కొంతమంది చరిత్రకారులు వేరువేరు వాదనలను వ్యక్తపరుస్తున్నారు. పూర్వకాలంలో ఆదిమానవులు ఖగోళ పరిశోధనలు చేయడానికి, మతపరమైన కార్యకలాపాలు జరపడానికి, సమావేశాలు నిర్వహించడం కోసం ఇలాంటి గుహలను ఉపయోగించే వారని చెబుతున్నారు. అంతే కాదు తమ ఆదిమానవులు వారి సమూహంలోని వారు ఎవరైనా మృతిచెందితే వారికి దహన సంస్కారాలు చేసినచోట చిన్న బండలను కిందపెట్టి వాటి పై పెద్ద రాతి బండను పెట్టేవారని చరిత్ర చెబుతుంది. ఇలాంటి కట్టడాన్ని డాలమిన్ లేదా రాక్షస గుహలు అని పిలుస్తారట. ఈ గుహలు ఎక్కువగా స్కాండినేవియా, ఐర్లాండ్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చెబుతుంది.

Advertisement

Next Story

Most Viewed