TPTF: నూతన పాఠ్య ప్రణాళికలు రచించాలి.. ప్రభుత్వానికి టీపీటీఎఫ్ సంఘం విజ్ఞప్తి

by Ramesh Goud |
TPTF: నూతన పాఠ్య ప్రణాళికలు రచించాలి.. ప్రభుత్వానికి టీపీటీఎఫ్ సంఘం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆధునిక(Modern), శాస్త్రీయ(Scientific), సాంకేతిక అంశాలు(Technical Subjects) విద్యార్థుల(Students)కు అందించేలా.. నూతన పాఠ్యప్రణాళికల్ని రచించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation)(టీపీటీఎఫ్) సంఘం నాయకులు ప్రభుత్వాలను కోరారు. హైదరాబాద్ జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఆలియా ప్రభుత్వ పాఠశాల(Alia Government School)లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి వెంకటేశ్వర ప్రసాద్(Venkateswara Prasad) అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్(Mutyala Ravinder) హాజరై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఆయన ఖండించారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో కనీసమైన మౌలిక వసతులు కల్పించకుండా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించకుండా, విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో కొత్త పాఠశాలను నిర్మిస్తామని, స్కిల్ యూనివర్సిటీ పెడదామని ప్రభుత్వం అనేక కొత్త ఆలోచనలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే కులానికో గురుకులం సంప్రదాయం పాఠశాలల అస్తిత్వాన్ని మసకబారేలా చేస్తుంటే ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో ఏర్పాటుచేస్తే కొత్త పాఠశాలలకు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా 15 ఏండ్లుగా సామాజిక, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచ దేశాలు విశ్వ విజ్ఞానం కోసం పోటీపడుతుంటే ఇక్కడ మాత్రం పాతబడ్డ పాఠ్య ప్రణాళికను అనుసరిస్తున్నారని విమర్శలు చేశారు. అందుకే నూతన పాఠ్య ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం టీపీటీఎఫ్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నికున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వర ప్రసాద్ నియామకమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బీ రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎం సురేందర్, కే సీతారామ శాస్త్రి, ఎం వెంకటేశ్వర్ రెడ్డి, వీ కామేశ్వరి, కే గీత, శివానంద్, జగదీశ్వర్, కార్యదర్శులుగా ఎం సోమిరెడ్డి, అందేకర్ రవి, జీ సురేశ్, కేఎస్ అన్నపూర్ణ, ఏ వెంకటరమణ, జే వెంకటేష్, అర్షియా ఫర్హత్, ఎన్ సంజీవ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎస్ రామానందయ్య, ఎం వెంకటరమణ, రమణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed