దీపాదాస్ మున్షీకి మద్దతుగా నిలిచిన టీపీసీసీ.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

by Ramesh N |
దీపాదాస్ మున్షీకి మద్దతుగా నిలిచిన టీపీసీసీ.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్‌గా పని చేసిన దీపాదాస్ మున్షీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని, ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కొన్ని దిన పత్రికలు, ప్రసార మాద్యమాల్లో దీపాదాస్ మున్షీ పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారని అది అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.

దీపాదాస్ మున్షీ కేరళ ఏఐసీసీ (AICC) ఇంచార్జిగా ఉంటూ తెలంగాణలో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారని, ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇంచార్జి లను, సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణకు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్‌ను నియమించారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో పూర్తి బాధ్యతలతో పని చేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావన్నారు. దీపాదాస్ మున్షీ ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణిగా, పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం, నీతి, నిజాయితీగా పని చేసిన చరిత్ర ఉందని, పార్టీని క్రమశిక్షణగా, సంస్థాగతంగా బలోపేతం చేశారని వివరించారు.


Advertisement
Next Story

Most Viewed