TPCC Meeting: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి డేట్ ఫిక్స్.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

by Shiva |
TPCC Meeting: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి డేట్ ఫిక్స్.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Cheif Mahesh Kumar Goud) అధ్యక్షతన ఈనెల 28న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌‌ (Gandhi Bhavan)లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచ్చార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ (Vishnu Nath), విశ్వనాథ్ (Vishwanath) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పీఏసీ (PAC), పీఈసీ (PEC) సభ్యులు, మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు, ఎంపీ‌లు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్లన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పాల్గొంటారు. భేటీలో భాగంగా కులగణన సర్వే నివేదిక (Cast Census Survey Report), అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill), ఎస్సీ ఉప కులాల వర్గీకరణ బిల్లు పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ (Congress) ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.



Next Story