బీఆర్ఎస్ నుండి ఒక్క రూపాయి తీసుకున్న సర్వనాశనమైపోతా: రేవంత్ రెడ్డి

by Satheesh |
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నుండి ఒక్క రూపాయి తీసుకున్న తాను సర్వనాశనమైపోతానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నుండి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

అమ్మవారిపై ప్రమాణం చేసిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో లాలూచీ నా రక్తంలోనే లేదని.. తుది శ్వాస వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుండి డబ్బులు తీసుకున్నానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ, బీఆర్ఎస్ డబ్బుతో బరిలోకి దిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాత్రం ఒక్క రూపాయి పంచకుండా ప్రజా తీర్పు కోరిందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్లు పంచాయన్నారు.

మునుగోడులో మద్యం పంపిణీ చేయకుండా మేం ఓట్లు అడిగామని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఏం జరిగిందో అందరికి తెలుసని అన్నారు. నోటీసుల రాగానే నీలాగా లొంగిపోయే వ్యక్తిని కాదని ఈటలపై ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఈటలపై సానుభూతి ఉండేదని.. కానీ ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed