కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివాడు.. తింటే చస్తారు: పప్పు కామెంట్స్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |   ( Updated:2023-11-03 08:18:45.0  )
కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివాడు.. తింటే చస్తారు: పప్పు కామెంట్స్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోన్న కొద్ద నేతలు విమర్శల ఘాటు పెంచుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆల్ ఇండియా పప్పు, రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది.. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివాడు.. తింటే చస్తారని దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు అని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed