- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లి చేసుకోకుండా ఆమె జీవితాన్ని కాంగ్రెస్‌కు అంకితం చేసింది.. మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

వెబ్‌డెస్క్: ఏఐసీసీ(AICC) మాజీ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ(Deepa Dasmunsi)కి ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్షీకి ధన్యవాద తీర్మానంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి.. భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం(Congress High Command) ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. కేసీఆర్(KCR) పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో ఇచ్చాం.. వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 56 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పదేళ్లలో బీఆర్ఎస్(BRS) ఇచ్చిన మొత్తం నిధుల కంటే ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు గుర్తుచేశారు. చారిత్రక కులగణన సర్వే చేసి.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్‌కి మనస్ఫూర్తిగా పని చేసే మహా నాయకురాలు మీనాక్షి నటరాజన్(ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జి) అని కొనియాడారు. గతంలో మనకు ఎన్ని పాత అలవాట్లు ఉన్న విడిచి.. కొత్త అలవాట్లు చేసుకొని మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మాదిరి సింప్లిసిటీగా ఉండాలి. పార్టీ కోసం మనం నిరంతరం శ్రమించాలి.. కార్యకర్తల కృషితో పాటు నాడు పీసీసీ చీఫ్‌లుగా పనిచేసిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డిల వల్ల పార్టీ ఈ స్థాయికి వచ్చిందని అన్నారు.