అడవుల సంరక్షణకు పెద్ద పులులు అవసరం: ఎంపీ సంతోష్​

by Satheesh |
అడవుల సంరక్షణకు పెద్ద పులులు అవసరం: ఎంపీ సంతోష్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రవేశపెట్టిన టైగర్​ప్రాజెక్టుకు యాబై ఏళ్లు నిండాయి. ఈ ప్రాజెక్ట్​ద్వారా తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1973లో 1827గా నమోదైన పులుల సంఖ్య, 2022 నాటికి 2967కు చేరింది. టైగర్ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది.

ఈ మేరకు ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యతను రాజ్యసభ ఎంపీ, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్​కుమార్​మాట్లాడుతూ.. అడవులు పెంచడం వలన పర్యావరణాన్ని సమతుల్యం చేయొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్ బందు పాల్గొన్నారు.

Advertisement

Next Story