రేవంత్ రెడ్డితో భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లోకి తుమ్మల..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-31 15:27:10.0  )
రేవంత్ రెడ్డితో భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లోకి తుమ్మల..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రేవంత్ వెంట మల్లు రవి, సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కాగా గత కొంత కాలంగా తుమ్మల బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తుమ్మల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న తుమ్మలకు ఇటీవల బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన భారీ ర్యాలీగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో చర్చించి త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement

Next Story