చంపేస్తాం.. MLA రాజాసింగ్‌కు పాకిస్థాన్ నెంబర్ నుండి బెదిరింపు కాల్స్!

by Satheesh |   ( Updated:2023-02-20 13:34:54.0  )
చంపేస్తాం.. MLA రాజాసింగ్‌కు పాకిస్థాన్ నెంబర్ నుండి బెదిరింపు కాల్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. తనను చంపుతామని పాకిస్థానీ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ ద్వారా వార్నింగ్స్ వస్తున్నాయని రాజాసింగ్ సోమవారం చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. వారి వద్ద తన కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయని తనను చంపేస్తామంటున్నారని రాజాసింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం 3:34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చిందని.. ప్రతిరోజు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్‌లో కేంద్ర హోం మంత్రి, డీజీపీ, సీపీలను ట్యాగ్ చేశారు. కాగా నిన్న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్‌కు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టవద్దని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story