DGP warning: ర్యాగింగ్ కు పాల్పడేవారిని వదిలేదు లేదు.. హెచ్చరించిన డీజీపీ

by Prasad Jukanti |   ( Updated:2024-08-17 06:40:48.0  )
DGP warning: ర్యాగింగ్ కు పాల్పడేవారిని వదిలేదు లేదు.. హెచ్చరించిన డీజీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ర్యాగింగ్ చేసే వారిని వదిలేపెట్టబోమని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందని, ర్యాగింగ్ కు పాల్పడినా, డ్రగ్స్ సప్లై చేసినా, వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనిస్తే వెంటనే వారితో మాట్లాడాలని సూచించారు. డ్రగ్స్ నివారణ, యాంటీ ర్యాంగింగ్ పై శనివారం మాసబ్ ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ కొత్త కోట ప్రభాకర్, సందీప్ శాండిల్యా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ర్యాగింగ్ కారణంకా కొంత మంది విద్యార్థులు కాలేజీలకు దూరం అవుతున్నారని అన్నారు. ర్యాగింగ్ అనేది బ్యాన్ చేయబడిందని అటువంటి వాటికి పాల్పడవద్దని సూచించారు. ర్యాగింగ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ర్యాగింగ్ ను అరికట్టేందుకు పోలీసు శాఖ వైపు నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ర్యాగింగ్ ట్రాప్ లో ఎవరూ పడవద్దని హెచ్చరించారు. ఈ హాల్ లో కూర్చున్న వారంతా పోలీసులకు అంబాసీడర్లని ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు సహకరించాలన్నారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ కారణంగా వారి జీవితాలనే కాకుండా వారి కుటుంబాలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed