- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mynampally Hanumanth Rao : మల్కాజిగిరిలో ఆ స్కీంలు బంద్.. మైనంపల్లికి BRS షాక్!
దిశ ప్రతినిధి, మేడ్చల్ : బీసీ బంధు.. మైనారిటీ బంధు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ బంద్...దళిత బంధు రెండో విడుత దరఖాస్తుల సేకరణ బంద్. ఇలా మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రభుత్వ పథకాలన్నీ బంద్... స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే ప్రభుత్వ పథకాలన్నింటినీ తెలంగాణ సర్కార్ తాత్కలికంగా నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక సాకు చెప్పి ప్రభుత్వ పథకాల పంపిణీకి బ్రేక్ వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
మైనంపల్లికి చెక్ పెట్టేందుకేనా....
మెదక్ ఆసెంబ్లీ సీటును తన కుమారుడు రోహిత్‌కు కేటాయించకపోవడంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హరీష్ రావుపై అంతటి ఘాటైన వ్యాఖ్యలు చేసినా.. మైనంపల్లికి మల్కాజిగిరి సీటును గులాబీ బాస్ కేటాయించారు. అయితే మైనంపల్లి మాత్రం తన కొడుక్కి టికెట్ ఇవ్వకుంటే మెదక్ తో సహా మల్కాజిగిరిలలో రెండు చోట్ల స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేసి, తమ సత్తా చూపిస్తామని ప్రకటించారు.
దీంతో పార్టీ అధిష్టానం మైనంపల్లిపై చర్యలేమీ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మైనంపల్లిపై చర్యలు తీసుకోవడంలో అధిష్టానం అలసత్వం ప్రదర్శిస్తుండడంతో హరీష్ రావు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మైనంపల్లిపై చర్యలు తీసుకునే క్రమంలోనే భాగంగా మల్కాజిగిరిలో ప్రభుత్వ పథకాలను ఆయన చేతుల మీద పంపిణీ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
లబ్దిదారుల్లో ఆందోళన
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల మేళాను నిర్వహిస్తుంది. బీసీ బంధు, మైనారిటీ బంధులను పంపిణీ చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రిలీజ్ చేస్తోంది. దళిత బంధు రెండో విడుతలో భాగంగా నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక పక్రియను వేగవంతం చేసింది. నియోజకవర్గానికి 500 చొప్పున లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరి పత్రాలను అందించింది.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇలా.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఓటర్లు ఎది కావాలంటే అది చేసి పెడుతోంది. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్, గూళ్లు, గోపురాలు ఇలా ఏది కావాలన్నా క్షణాల్లో మంజూరు చేయిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మల్కాజిగిరిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు లబ్దిదారులకు అందకుండా పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తీర్థయాత్రలలో మైనంపల్లి బీజీ..
తిరుమల కొండపైనే గత నెల ఆగస్టు 21వ తేదీన మంత్రి హరీష్ రావును ఎకిపారేసిన మైనంపల్లి అప్పటి నుంచి తీర్థ యాత్రలతో బీజీ బీజీగా గడుపుతున్నారు. ఆగస్టు 26వ తేదీన బాచుపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని తాను ఏమి అనలేదని, తనను పార్టీ ఏమి అనలేదని సంచలన కామెంట్ చేశారు. వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి ఇంత వరకు ఏమి ప్రకటించలేదు. ఆనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోని వచ్చిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి కూడా ఏమి వెల్లడించలేదు.. ప్రస్తుతం మైనంపల్లి తమిళనాడు, తిరుపతి తీర్థయాత్రల పర్యటనలలో ఉన్నట్లు ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై నేరుగా చర్యలు తీసుకోకుండానే..పార్టీని విడిచి వెళ్లిపోయేలా వ్యుహాం పన్నుతున్నట్లు సమాచారం. ముందుగా మైనంపల్లి ఆదేశాలను అధికారులు వినకుండా చేయాలని, ఆ తర్వాత కార్పొరేటర్లు, కీలక నేతలను దూరం చేయాలని స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా మైనంపల్లి ఎపిసోడ్ వల్ల మల్కాజిగిరిలో సంక్షేమ, అభివృద్ది పథకాలకు బ్రెక్ పడడం గమనార్హం.