- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేసులో ఆ నలుగురు.. కొత్త డీజీపీ ఎవరో...?
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర డీజీపీ నియామకం జరుగనుంది. ఈ క్రమంలో పోలీసు శాఖలో కొత్త బాస్ ఎవరన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. రేసులో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ డీజీపీగా ఉన్న రవిగుప్తాతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు జితేందర్, రాజీవ్ రతన్, సీ.వీ.ఆనంద్‌లు ఉన్నారు. ఈ నలుగురిలోనే ఎవరో ఒకరికి డీజీపీ పగ్గాలు దక్కుతాయని చెబుతున్న పోలీసు వర్గాలు రవిగుప్తా, రాజీవ్ రతన్‌లలో ఒకరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి.
ఓట్ల లెక్కింపు రోజున కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని సంకేతాలు రాగానే అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ ఛీఫ్ మహేశ్ భగవత్‌లు సీబీఐ కాలనీలోని రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేయాలని సూచించింది. మిగితా ఇద్దరికి వివరణ ఇవ్వాలని సూచిస్తూ నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్‌కుమార్ జైన్, మహేశ్భగవత్లకు నోటీసులు జారీ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఏసీబీ డీజీగా ఉన్న రవిగుప్తాను ఇన్‌ఛార్జ్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త డీజీపీ నియామకం జరుగనుంది.
ప్రస్తుతం ఈ పోస్టు కోసం ఇన్‌ఛార్జ్ డీజీపీగా ఉన్న 1990 సంవత్సరం బ్యాచ్ అధికారి రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా ఉన్న 1991వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్, ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు బదిలీ అయిన అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్‌తో పాటు ప్రస్తుతం జైళ్ల శాఖ డీజీ, హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న 1992వ సంవత్సరం బ్యాచ్ అధికారి జితేందర్ పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వీరిలో ఎవరికి డీజీపీ పోస్టు దక్కనుందో అన్న చర్చ పోలీసుశాఖలో జోరుగా నడుస్తోంది. కొంతమంది సీనియర్ పోలీసు అధికారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ డీజీపీగా ఉన్న రవిగుప్తానే పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీలో ఉన్న ముగ్గురిలో రవిగుప్తా సీనియర్ కావటం, వివాద రహితునిగా పేరుండటం ఆయనకు కలిసొచ్చే అంశాలను అధికారులు అంటున్నారు. రవిగుప్తా కాని పక్షంలో డీజీపీగా రాజీవ్ రతన్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో సీ.వీ.ఆనంద్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు నుంచి తప్పించటం గమనించాల్సిన అంశమని అంటున్నారు. హైదరాబాద్ కమిషనర్ పోస్టు నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన అధికారిని డీజీపీగా నియమించే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. జైళ్ల శాఖ డీజీపీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ రేసులో ఉన్న అధికారుల్లో జూనియర్ అని పేర్కొంటున్న అధికారులు ఆయనకు కూడా డీజీపీ పోస్టు రావటం కష్టమేనని అంటున్నారు. ఇక, సస్పెండ్ అయిన అంజనీకుమార్‌ను తిరిగి సర్వీస్‌లోకి తీసుకున్న ఆయనకు డీజీపీ పోస్టు దక్కటం అసాధ్యమని చెబుతున్నారు. పోలీసు శాఖకు కొత్త బాస్ఎవరవుతారన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది.