స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు: Minister Niranjan Reddy

by Satheesh |   ( Updated:2023-08-23 13:37:58.0  )
స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు: Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదకొండవ విడతలో 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు రూ.7624.74 కోట్లు రైతుబంధు జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తిచేసుకున్నామని, మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు అందజేశామని తెలిపారు.

తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఎన్ని ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నామని స్పష్టం చేశారు. స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు అని, అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన అని, దేశంలో ఉచిత కరెంటు, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

Advertisement

Next Story