మా ఇద్దరిని హత్య చేయాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-16 06:08:15.0  )
మా ఇద్దరిని హత్య చేయాలని చూస్తున్నారు..  అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయన్నారు. మా ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్‌తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందన్నారు. అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల అసదుద్దీన్ మాట్లాడుతూ.. కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని.. కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed