- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rythu Bharosa: రైతు భరోసా పథకం సాయానికి కావాల్సింది ఇవే !

దిశ, వెబ్ డెస్క్: రైతు భరోసా పథకా(Rythu Bharosa Scheme)న్ని అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గతంలో మాదిరిగా పంట పెట్టుబడి సాయం నిధులు పక్కదారి పట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి శుభ ముహూర్తం పెట్టింది. ఇక వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి రూ. 6000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలో జమ చేయనుంది. రైతు భరోసా అమలుతో 8900 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. తాజా వ్యవసాయ శాఖ అందించిన గణాంకాల ప్రకారం వర్షాకాలంలో 1.49 కోట్ల ఎకరాలలో పంటలు సాగు అయినట్టు నివేదికల ఆధారంగా గుర్తించింది. దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కాదని తేల్చి వాటి సర్వే నెంబర్లను కూడా బ్లాక్ చేశారు.
రైతు భరోసాకు దరఖాస్తులు ఇలా(Applications For Rythu Bharosa).
తెలంగాణ ప్రభుత్వం జనవరి 26నుంచి అందించనున్న రైతు భరోసా(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి 2024-25 ఎకరాకు రూ.12వేలు) కోసం అర్హులైన రైతులు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ తెలిపింది. జనవరి 1వ తేదీ 2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుదారుల కోసం పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ కాపీ, అధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్, పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారంతో సదరు పత్రాలను క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలని సూచించింది. గతంలో పెట్టుబడి సహాయం వచ్చిన రైతుల బ్యాంకు, అకౌంట్ నంబర్ మార్పులు ఉంటే, బ్యాంకు అకౌంట్ నెంబర్ మార్పు కావలసిన రైతులు దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలని తెలిపింది.
అలాగే జనవరి 1వ తేదీ 2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడిందని.. డిజిటల్ సంతకం అయినా రైతులు ఈ పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ తెలిపింది. గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.