టీఎస్పీఎస్సీ అక్రమల పై పూర్తి దర్యాప్తు చెయ్యాలి: బక్క జడ్సన్

by Mahesh |   ( Updated:2023-12-19 14:05:17.0  )
టీఎస్పీఎస్సీ అక్రమల పై పూర్తి దర్యాప్తు చెయ్యాలి: బక్క జడ్సన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష లీకేజీ లపై విచారణ చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుండి టీఎస్పీఎస్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలపై విచారణ చేయాలని కోరినట్లు జడ్సన్ తెలిపారు. కమిషన్ లో పని చేసే సిబ్బంది బ్యాక్ గ్రౌండ్ గత సర్వీస్ రికార్డ్ చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.

గత సంవత్సరం పేపర్ లీక్ దర్యాప్తుకై నియమించిన షిఫ్ట్ నివేదికపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరినట్టు అయన తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 30 లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్షల కై సిద్ధపడుతుంటే ఈ లీకేజీల వ్యవహారం వారిని కృంగదీసి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టిఎస్పిఎస్సి చైర్మన్ గా గంట చక్రపాణి గారు ఉన్న నాటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను శిక్షించాలని తద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించాలని కమిషనర్‌ను జడ్సన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story