VIRAL : ఆధార్ కార్డులో తెలంగాణ లేద‌ని.. ఫ్రీ టికెట్ కండ‌క్ట‌ర్ ఇవ్వలేదట!

by Ramesh N |
VIRAL : ఆధార్ కార్డులో తెలంగాణ లేద‌ని.. ఫ్రీ టికెట్ కండ‌క్ట‌ర్ ఇవ్వలేదట!
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత బస్సుల్లో జరిగిన ఘటనలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదని ఫ్రీ టికెట్ కండక్టర్ ఇవ్వలేదట. ఈ క్రమంలోనే కండక్టర్ ఆ మహిళను తట్టిడని టీజీఎస్‌ఆర్టీసీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్, కూకట్‌పల్లి-4 ఫేజ్‌లో ఓ మహిళ ఏపీ 11Z6960 బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించిందని, అందులో అడ్రస్ మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అని ఉండగా తెలంగాణ అని లేదని ఫ్రీ టికెట్ ఇవ్వను అంటూ కండక్టర్ ఆ యువతిని తిట్టాడని ఆరోపణలు వచ్చాయి.

ఆ మహిళ ఎంత వారించినా వినకుండా టికెట్ తీసుకోవాల్సిందేనని, లేదంటే బస్సు నుంచి దిగిపోవాలంటూ కండక్టర్ వారించారని, చివరికి రూ. 30 చెల్లించి యువతి టికెట్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆర్టీసీకి ఫిర్యాదులు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. సంబంధిత అధికారులకు ఆర్టీసీ సూచించింది. తెలంగాణ ప్రజల ఆధార్‌లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయింది, ఆధార్ కార్డు పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేయించుకోవాలి అని తెలీదు ఏమో..? ఎప్పటి ఆధార్ కార్డు అది? కొత్తలొ ఇచ్చిన కార్డు ఆ? అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed