అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-03-16 08:55:53.0  )
అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్‌కర్నూల్ బీజేపీ బహిరంగ సభలో శనివారం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని, మళ్లీ బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గరీబ్ హటావో నినాదం చేసిందని, కానీ దేశాన్ని దోచుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి రెండు పార్టీలు అడ్డుపడ్డాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని, పేద ప్రజల జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందని, ఈ సారి 400 వందల సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. మోడీ గ్యారంటీ ఇస్తే.. జరిగి తీరాల్సిందేనని చెప్పారు. మాదిగ సముదాయాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అవమానించిన ఫోటోలను తెలంగాణ ప్రజలంతా చూశారని మోడీ అన్నారు. యాదాద్రిలో చిన్నపీట వేసి ఉప ముఖ్యమంత్రి భట్టిని కాంగ్రెస్ అవమానించిందని తెలిపారు. దళితులను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌‌ను అవమానించారని గుర్తుచేశారు. దళిత బంధు పేరిట కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. అవినీతిపై తాను చేసే పోరాటానికి తెలంగాణ మద్దతు, ఆశీర్వాదం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story