- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eatala Rajender: మెరిట్ ఉన్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ జడ్జీలేరి?:ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో: న్యాయమూర్తుల నియామకంలో కుల వివక్ష, కుటుంబ నియామకాల వ్యవస్థ మిగతా అన్ని రంగాల్లో కంటే ఎక్కువగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. అన్ని విధాలుగా సామర్థ్యం, అర్హతలు ఉన్నా ఇప్పటికీ బీసీలు హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జీలుగా ఎందుకు లేరని ఇదేం దుర్మార్గం అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajoguda Press Club) లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు శాసన సభ, శాసన మండలి, పార్లమెంటులో రిజర్వేషన్లు లేవని అలాగే న్యాయవ్యవస్థలో కూడా వివక్ష కొనసాగుతుందన్నారు. ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఉందని కులాల మీద లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.
అలాంటి అధికారులు రూల్స్ చెప్పి పంపుతారు:
అంబేద్కర్ (Ambedkar) స్ఫూర్తి దేశంలో అమలు కావడంలేదని రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మెరిట్ లెస్ రూలర్స్ దేశాన్ని పాలించారని విమర్శించారు. నేను కులానికి, మతానికి వ్యతిరేకం కాదని కేవలం వివక్ష, దుర్మార్గం, పేదరికానికి తాను వ్యతిరేకం అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోరడం, ఇంత మెరిట్ ఉన్నా మా వాటా ఎందుకు లేదు అని మనమంతా గళమెత్తే దుర్మార్గ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. ఓబీసీకి చెందిన మోడీ (Narendra Modi) ప్రధాన మంత్రి అయినప్పుడు కొంతమంది ఏవేవో మాట్లాడారు. కానీ సంకీర్ణ యుగంలో మూడవ సారి అధికారంలోకి వచ్చారు అంటే ఇది మోడీ మెరిట్ కాకుంటే ఏమనాలన్నారు. ఆకలి దుఃఖం నుండి వచ్చినవాడు ఉంటే ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రధాని అయ్యారన్నారు. ఆకలి అనుభవించిన ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళితే.. ప్రజల కోసం పరిష్కారం చూపుతారు. అదే బాధ తెలియని అధికారి కేవలం రూల్స్ మాత్రమే చెప్పి పంపిస్తారన్నారు.
అడ్వకేట్లకు స్టైఫెండ్, వైద్య బీమా అందించాలి:
బీసీ-బీ, బీసీ-డి లో ఓపెన్ కాంపిటేషన్ కంటే ఎక్కువ కాంపిటేషన్ ఉందని హక్కుల కోసం కొట్లడాలి, సాధించుకున్న హక్కుల అమలుకోసం కూడా కోట్లడాలి అంటే ఎంత దుర్మార్గం. మర్లపడ్డ తెలంగాణలాగా బీసీ వర్గాలు దేశవ్యాప్తంగా మర్లపడే రోజు వస్తుంది. తెలంగాణ ఒక వేగుచుక్క అవుతుందన్నారు. అడ్వకెట్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు మర్చిపోలేనిదని మీ స్ఫూర్తి, ఐక్యత గొప్పదన్నారు. అడ్వకెట్లుకు ఉపాధి లేకుండా పోతుందని కుటుంబాలను పోషించే పరిస్థితి లేకుండా పోయింది. వీరికి ఐదేళ్లవరకు స్టైఫెండ్, వైద్య బీమా అందించాలని డిమాండ్ చేశారు. మీ ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నాన్నానన్నారు.
సమావేశ తీర్మానాలు :
ఈ సమావేశంలో న్యాయస్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 256 మంది న్యాయమూర్తులు నియమితమైతే బీసీ 4, ఎస్సీ 5, ఎస్టీ 1, మహిళలు 11 మంది మాత్రమే జడ్జీలు అయ్యారు. 97 శాతం మంది అగ్రవర్ణాలు, 2.9 శాతం మంది బీసీ ఎస్సీలు నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు హైకోర్టు జడ్జీలుగా 211 మంది నియామకాలు జరిగితే, ఇందులో 155 మందిని బార్ నుండి ఎంపిక చేశారు. అందులో అగ్రవర్ణాల నుండి 155 , ఎస్సీ 5, ఎస్టీ 1, బీసీ 16, మైనారిటీలు 9 మంది నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు రిజక్వేషన్లు కల్పించేలా అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాలి అని ఈ సమావేశం తీర్మానించింది.