Mahesh Kumar Goud : కాంగ్రెస్ లో గ్రూపులు లేవు.. అంతా ఒకటే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by M.Rajitha |
Mahesh Kumar Goud : కాంగ్రెస్ లో గ్రూపులు లేవు.. అంతా ఒకటే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ మీడియా ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న ఆయన విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్దపు ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నామని అన్నారు. 'హైడ్రా'(HYDRA)ను మంచి ఆశయం కోసం ఏర్పాటు చేశామని, విపక్షాలు దానిని ప్రజల్లోకి తప్పుగా తీసుకు వెళ్లారని అన్నారు. ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్(BRS) విష ప్రచారం చేస్తోందని, అయితే గత పదేళ్ల చీకటి పాలనను ప్రజలు మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. నీళ్ల పేరిట లక్షల కోట్లను బీఆర్ఎస్ నీళ్లలో పారబోశారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాని ఘనత బీజేపీ(BJP)కి దక్కుతుందని మండిపడ్డారు. తమ పాలనలో ప్రజలు బాగుందని చెబుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తనకు మంచి సయోధ్య ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమేనని, ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed