జులై 12 నుంచి ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. పిలుపునిచ్చిన టీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

by Javid Pasha |
జులై 12 నుంచి ఆర్టీసీ  కార్మికుల ఆందోళన.. పిలుపునిచ్చిన టీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
X

దిశ , తెలంగాణ బ్యూరో : టీఎస్ఆర్టీసీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం ఈ నెల 12 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంప్లాయీస్ యూనియన్ నిర్ణయించింది. ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ రీజినల్ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి మాట్లాడుతూ .. ఆర్టీసీలో కార్మికుల అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధించుకునేందుకు జెఏసి నిర్ణయించిన ఉద్యమ కార్యచరణ విజయవంతం చేయాలని అయన కోరారు.

ఇదివరకు కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఎన్నో పోరాటాలను అయన వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని , 16 న రాజకీయ, ట్రేడ్ యూనియన్ల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పారు. 22 న హై కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

డిమాండ్స్

ఆర్టీసీలో కార్మిక చట్టాలను అమలు పర్చాలని తెలిపారు. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్ ఉండాలని, ఆర్టీసీలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలి, కార్మికులకు బాకి ఉన్న వేతన సవరణ లు చేయాలన్నారు. విద్యుత్ బస్సుల ఆర్టీసీలకు 90% సబ్సిడీ పైన ఇవ్వాలని, కార్పొరేట్ శక్తులకు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఆర్టీసీలను నిర్వీర్యం చేసేలా టూరిస్ట్ పర్మిట్ గైడ్ లైన్స్ లో విద్యుత్ బస్సులకు ఫీజు లేకుండా పర్మిట్ ఇచ్చే నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ బస్సుల అక్రమ రవాణాని అరికట్టాలి, పర్మిట్ లేకుండానే అక్రమంగా తిరుగుతున్న తెల్ల నెంబర్ ప్లేట్ కార్లను నియంత్రించాలన్నారు

నూతన కమిటీ ఎన్నిక

ఎంప్లాయిస్ యూనియన్ నాయకులూ డి.గోపాల్ ఆద్యక్షతన హైదరాబాద్ రీజియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎస్ రెడ్డి డ్రైవర్ ఎంపీ డిపో రీజినల్ అధ్యక్షునిగా , ఆర్.కిషన్ గౌడ్ డ్రైవర్ బి కె పి డిపో వర్కింగ్ ప్రెసిడెంట్, ఏ ఎస్ రెడ్డి కండక్టర్ బండ్లగూడ డిపో రీజినల్ కార్యదర్శి, జి .జంగయ్య గౌడ్ కండక్టర్ కాచిగూడ డిపో కోశాదికారి,ఎస్.శ్యామల కమీటీ మెంబర్ గా ఎన్నుకోవడం జరిగింది.

Advertisement

Next Story