ఎస్సై కుటుంబానికి బ్యాచ్​మేట్ల అండ.. రూ.25 లక్షల ఆర్థిక సాయం

by Javid Pasha |
ఎస్సై కుటుంబానికి బ్యాచ్​మేట్ల అండ..  రూ.25 లక్షల ఆర్థిక సాయం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్​ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్​కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సబ్​ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ ​సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25 లక్షల రూపాయలను సేకరించి ప్రభాకర్ ​కుటుంబానికి అందించారు. ఇందులో ఇరవై లక్షల రూపాయలను ప్రభాకర్​ మూడేళ్ల కూతురు అక్షయరెడ్డి పేర మ్యూచువల్​ ఫండ్స్ రూపంలో ఫిక్స్​డ్ ​డిపాజిట్​ చేశారు.

మిగతా అయిదు లక్షల రూపాయలను ప్రభాకర్​రెడ్డి తల్లిదండ్రులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్​రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, తల్లిదండ్రులు, ఎల్బీనగర్​ స్టేషన్​లో ఎస్సైగా పని చేస్తున్న అన్న దయాకర్​రెడ్డి, 2014వ సంవత్సరం వెల్ఫేర్​ సొసైటీ అధ్యక్షుడు టాటా శ్రీధర్, రామకృష్ణ, శ్రీనివాసులతోపాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Next Story