- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గెలుపుతో ‘గులాబీ’ అధికారుల్లో గుబులు.. ఆ ముగ్గురు IAS ఆఫీసర్లపై చర్యలు..?
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసిన ఆఫీసర్లపై చర్యలు తప్పవని ఇప్పటికే కాంగ్రెస్ హెచ్చరించింది. దీంతో మొన్నటివరకు కేసీఆర్ సర్కారులో పలు కీలక శాఖల్లో పనిచేసిన ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు. తమ భవిష్యత్తేమిటని ఆందోళన చెందుతున్నారు. సేఫ్‌గా ఉండేందుకు చాలా మంది బ్యూరోక్రట్స్ కాంగ్రెస్ లీడర్లకు వద్దకు క్యూ కడుతున్నట్టు తెలుస్తున్నది.
ఆ ముగ్గురు ఆఫీసర్లపై బదిలీ వేటు..?
కేసీఆర్ సర్కారులో అత్యంత ఎక్కువ కాలం కీలకమైన శాఖలు చూసిన ఆఫీసర్లను బదిలీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. తొలి కేబినెట్ సమావేశం జరిగిన వెంటనే జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, స్మితా సబర్వాల్‌ను తప్పించే చాన్స్ ఉంది. ఎందుకంటే జయేశ్ రంజన్ ఐటీ అండ్ ఇండస్ట్రీ, అర్వింద్ కుమార్ మున్సిపల్ సెక్రటరీలుగా చాలా కాలం పాటు పనిచేశారు. బీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారు.
అలాగే పదేండ్లపాటు సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్‌పై కూడా కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నారు. మిషన్ భగీరథ స్కీమ్ కార్యకలాపాలు ఆమె కనుసన్నల్లోనే కొనసాగాయి. ఆ స్కీమ్ కమీషన్ భగీరథగా కాంగ్రెస్ విమర్శలు చేసింది. రూ. వేల కోట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఆమెపై కూడా కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆ శాఖలపై విచారణ
బీఆర్ఎస్ సర్కారులో రెవెన్యూ, మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రీ, ఇరిగేషన్ శాఖల్లో రూ. వేల కోట్ల అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పలు సార్లు ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారాణ జరిపి, సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఆ శాఖల్లో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు ప్లాన్ చేస్తున్నది. సిటీ శివారులోని అత్యంత విలువైన భూములను తక్కువ ధరలకే బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న సంస్థలు, వ్యక్తులకు కేటాయించినట్టు కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టానుసారంగా అంచనాలు పెంచి, రూ. వేల కోట్లు కమీషన్లు తీసుకున్నట్టు ఆరోపించింది. నెలరోజుల తరువాత ఆ శాఖలపై విచారణకు ఆదేశించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది.
రిటైర్డ్ ఆఫీసర్లలో గుబులు
రాష్ట్రంలో కొందరు ఆఫీసర్లు రిటైర్డ్ అయిన తరువాత కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రధానంగా ఇరిగేషన్, ఆర్అండ్ బీ శాఖల్లో రిటైర్డ్ అధికారులు మురళిధర్ రావు, గణపతి రెడ్డి చాలా ఏళ్లుగా ఈఎన్సీలుగా కొనసాగుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌లో ప్రతి ప్రాజెక్టు అంచనాలను ఇష్టానుసారంగా పెంచారని కాంగ్రెస్ లీడర్లు విమర్శలు చేశారు. అలాగే సెక్రటేరియట్, ప్రగతిభవన్, కలెక్టరేట్స్ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆరెండు శాఖలపై కూడా విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.