మహిళా సంఘాలకు శుభవార్త.. చీర డిజైన్ ఫైనల్ చేసిన CM రేవంత్

by Gantepaka Srikanth |
మహిళా సంఘాలకు శుభవార్త.. చీర డిజైన్ ఫైనల్ చేసిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇవ్వబోయే చీరల(Saree)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. మంత్రి సీతక్క ఫైనల్ చేసిన చీరలను మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. లైట్ బ్లూకలర్‌ రంగులో ఉన్న ఈ చీరల అంచులో జాతీయ జెండా రంగులో ఉండేలా మూడు రంగులను డిజైన్ చేశారు. సీఎంకు చీరలు చూపించిన వారిలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.




Next Story

Most Viewed