- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నూతన నిబంధనలు ప్రవేశ పెట్టిన యూజీసీ.. జులై 1 నుండి అమల్లోకి
దిశ : తెలంగాణ బ్యూరో : ఉన్నత విద్యను బోధించే వివిధ కళాశాలలు , యూనివర్సిటీలలో బోదకాలు ఉండాల్సిన అర్హతలపై యూజీసీ పలు సూచనలు చేసింది. ఈ మేరకు గత నెల ౩౦ న నూతన నియమ నిబంధనలు అమలు చేయాలనీ పేర్కొంది . బోధకులకు కనీసం నెట్,సెట్ , స్లేట్ వంటి అర్హత పొంది ఉండాలని తెలిపింది . దీని ప్రకారం బోధన జరగాలని అలాగే జులై ఒకటి నుండి కొత్త నిబంధనలను అమలు చేయాలనీ ఆదేశించింది. కానీ రాష్టంలో ఈ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
యూజీసీ నిబంధలు అమలయ్యేనా ?
ఇంజనీరింగ్ కళాశాల్లో బోధించే అధ్యాపకులకు ఉండాల్సిన కనీస అర్హతలను తుంగలో తొక్కి కేవలం బీటెక్ చదివిన వారిని ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫసర్ , ప్రిన్సిపాల్ గా నియమిస్తూ నియమ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో కొన్నింటిలో అర్హతలు లేని ప్రిన్సిపాళ్లు, సహాయ ఆచార్యులున్నారు. అనుబంధ కళాశాలల గుర్తింపు కోసం ఆయా కళాశాలలు జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు సమర్పించిన జాబితాను పరిశీలించగా.. ఈ డొల్లతనం బయటపడిందని సమాచారం. జేఎన్‌టీయూ పరిధిలో 214 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. ఇందులో 30 శాతం కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసిన వారే ప్రిన్సిపల్స్ గా కొనసాగుతున్నారని తెలిసింది.
నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే?
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించాలంటే ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంటెక్ పూర్తి చేశాక 15 ఏళ్ల అనుభవం ఉండాలి. సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వారు పీహెచ్‌డీ పూర్తి చేయాలి. లేదంటే నెట్, సెట్, స్లేట్ లో ఉత్తీర్ణులయి ఉండాలి. కానీ ఇవేవి లేకుండా నిబంధనలు విరుద్ధంగా బీటెక్ పూర్తిచేసిన వారినే పలు కళాశాల్లో నియమిచుకున్నాయనే ఆరోపణలున్నాయి.
పడిపోయిన ఉతీర్ణత శాతం
అర్హులైన బోధకులను పలు కళాశాల్లో నియమించకపోవడం వల్ల నాణ్యమైన విద్య అందడం లేదు. దీంతో విద్యార్థుల ఉతీర్ణతపై ఈ ప్రభావం పడ్డట్టు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఫస్టియర్‌లో అన్ని విభాగాల్లో కలిపి 12వేల మంది ఫెయిల్ అవ్వగా.. ఈ ఏడాది 16వేల మంది పరీక్షల్లో ఫెలయ్యారు.
కొన్ని కళాశాల్లో అర్హతలు లేని వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించుకొని నడుపుతున్న విషయం జేఎన్‌టీయూ అధికారులకు ముందే తెలుసు. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. నామమాత్రంగా మొదట అధికారులు కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించినట్టు చేసి ఆతర్వాత వదిలేస్తు న్నారు. ఈ తంతు నాలుగైదేళ్లుగా కొనసాగుతోందని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కర్ నాయక్ ఆరోపించారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని.. లేదంటే బోధనా ప్రమాణాలు మరింతగా పడిపోయే అవకాశాలున్నాయని అయన అభిప్రాయపడ్డారు .