ఎన్సీపీ మాదంటే మాదంటూ శరద్ పవార్, అజిత్ పవార్ ఫైట్.. బాహుబలి ఎంట్రీ!

by Javid Pasha |
ఎన్సీపీ మాదంటే మాదంటూ శరద్ పవార్, అజిత్ పవార్ ఫైట్.. బాహుబలి ఎంట్రీ!
X

దిశ, వెబ్ డెస్క్: నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసింది. ఎన్సీపీకి చెందిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలను తీసుకొని షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం, 9 మంత్రి పదవులు దక్కాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ మాదంటే మాది అంటూ శరద్ పవార్, అజిత్ పవర్ వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. పార్టీ సింబల్, పార్టీని తమకే కేటాయించాలంటూ ఈసీకి పిటిషన్ దాఖలు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ గొడవలోకి బాహుబలి ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాహుబలి అంటే ప్రభాస్ కాదు. బాహుబలికి సంబంధించిన ఓ పోస్టర్ ను రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఎన్‌సీపీ వర్సెస్ ఎన్‌సీపీ సంక్షోభం మధ్య రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రంలోని ఒక సన్నివేశంపై రూపొందించిన పోస్టర్‌ను ప్రదర్శించింది. ఆ సినిమాలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప వెనుక నుంచి పొడిచిన చిత్రాన్ని ప్రదర్శించింది. ఇక నమ్మక ద్రోహానికి ఈ చిత్రం ప్రతీక అని, అజిత్ పవార్ ను విమర్శిస్తూ రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ ఈ పోస్టర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed