మాజీ సీఎస్ భూముల్లో వెలిసిన పోస్టర్లు.. భూములను జర్నలిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్

by Ramesh N |
మాజీ సీఎస్ భూముల్లో వెలిసిన పోస్టర్లు.. భూములను జర్నలిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎస్‌ అక్రమంగా భూములు సంపాదించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన భూముల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అక్రమ భూములు 25 ఎకరాలు కాదని, 149 ఎకరాలని ఆరోపించారు. ఆ అక్రమ భూములను తెలంగాణ జర్నలిస్ట్‌లకు ఇవ్వాలని ఆ భూముల్లో బోర్డు పాతినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ లోని అతిపెద్ద అవినీతి అనకొండ అధికారి అని విమర్శించారు.

బీహార్ దొంగల ముఠా గ్యాంగ్ లీడర్ సోమేశ్ కుమార్ మరో అక్రమ బాగోతమన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డగోలుగా సంపాదించిన సోమ్మును వెన‌కేసుకుంటున్నారని, అందుకేనేమో ఇప్పుడు ఒక్కో రూపాయిని బయటకు తీసి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొంటున్నారని జడ్సన్ ఆరోపించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపి పేద జర్నలిస్టులకు ఈ స్థలంలో భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ భూమిలో బోర్డును పాతడం జరిగిందని బక్క జడ్సన్ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed