8వ నిజాం ముకర్రం జా మృతితో ఖాళీ అయిన నిజాం ట్రస్ట్‌ల చైర్మన్​పదవి.. ఆ అస్తులను కాపాడేదేవరు..?

by Mahesh |
8వ నిజాం ముకర్రం జా మృతితో ఖాళీ అయిన నిజాం ట్రస్ట్‌ల చైర్మన్​పదవి.. ఆ అస్తులను కాపాడేదేవరు..?
X

దిశ, చార్మినార్: హైదరాబాద్​7వ నిజాం మీర్​ ఉస్మాన్​ఆలీఖాన్​తన కుమారులను కాదని తన మనవడు నవాబ్​ మీర్ ​బర్కత్ ​ఆలీఖాన్ సిద్దిఖి ముకర్రం జా ను వారసుడుగా ప్రకటించారు. ఏడవ నిజాం మీర్​ఉస్మాన్​ఆలీఖాన్​పెద్ద కొడుకు ఆజంజాను వరంగల్‌లోని ఆజం జాహీ మిల్స్​ఆయన పేరుమీదనే స్టార్ట్ చేశారు. కానీ అతని కొడుకు, మనువడిని ముకర్రంజా కు 8 వ నిజాంగా ముకర్రంజా కు చౌమహల్లా ప్యాలేస్‌లో పట్టాభిషేకం చేశారు. 8వ నిజాం ముకర్రం జా విదేశీ యువతులతో ఐదు వివాహాలు చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్య టర్కీకి చెందిన ప్రిన్సెస్​ఎస్రా తన వెంట ఆస్ట్రేలియాకు రాని కారణంగా ముకర్రం జా విడాకులిచ్చాడు.

20 ఏళ్ల తర్వాత ఆమె మద్దతు కోరగా ... నిజాం ఆస్తుల పాలన ఆమెనే చూస్తున్నాను. 6, అక్టోబర్​1933 లో ఫ్రాన్స్‌లో జన్మించిన ముకర్రం జా ఈ నెల 14వ తేదీన రాత్రి 10.30గంటలకు కన్నుమూశాడు. అయితే భారత దేశ వ్యాప్తంగా నిజాంకు సంబంధించిన 152 ట్రస్ట్‌లకు చైర్మన్‌గా ఉన్న ముకర్రంజా కన్నుమూయడంతో తదుపరి ఆట్రస్ట్‌లకు చైర్మన్​ఎవరు..? నిజాం ఆస్తులు కాపాడేదెవరు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 8 నిజాం ముకర్రం జా మృతి అనంతరం ముకర్రంజా మొదటి భార్య ప్రిన్సెస్​ ఎస్రా కు జన్మించిన అజ్మత్​ జా నే నిజాంకు సంబంధించిన 152 ట్రస్ట్​లకు చైర్మన్​కాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతి త్వరలో అజ్మత్ ​జా నే నిజాం ట్రస్ట్​లకు చైర్మన్​గా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed