బాలుడు మిస్సింగ్ కేసును నిమిషాల్లో ఛేదించిన పోలీసులు

by Sathputhe Rajesh |
బాలుడు మిస్సింగ్ కేసును నిమిషాల్లో ఛేదించిన పోలీసులు
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాలుగు సంవత్సరాల ఓ బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. బాలుడు నెహ్రూ సెంటర్‌లో బిక్కు బిక్కు మంటూ తిరుగుతూ కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆ బాలుని చేరదీసి వివరాలు అడగగా బాలుడు భయంతో సమాచారం అందించలేదు. దీనితో అక్కడే ఉన్న దిశ విలేకరి, స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టౌన్ ఎస్ఐ శీలం రవి వెంటనే స్పందించి బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ రుద్రయ్య బాలుడిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని పరిసర ప్రాంతాలలో వాకబు చేస్తుండగా.. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో బాలుడి యొక్క తల్లి తన బాలుడు తప్పిపోయాడని రోదిస్తూ కనిపించింది. వెంటనే రుద్రయ్య బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తికి, దిశ పత్రిక మానవతా దృక్పథానికి స్థానికులు ప్రజలు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed