- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Allu Arjun:కొనసాగుతోన్న విచారణ.. అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగే ప్రశ్నలివే!?

దిశ,వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై అల్లు అర్జున్(Allu Arjun) విచారణ కొనసాగుతోంది. చిక్కడపల్లి పీఎస్‌కు హాజరైన ఆయనను డీసీపీ, ఏసీపీ, సీఐ ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తాము ఆయనకు చెప్పామని పోలీసులు వెల్లడించగా, తనకు చెప్పలేదని ఆయన ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీనిపై ప్రధానంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫుటేజ్ ఆధారంగానే ఈ రోజు విచారణను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 18 ప్రశ్నలతో కూడిన పేపర్‌ను ఏసీపీ రమేష్, కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌కు అందజేశారు. ఈ మొత్తం విచారణను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.
బన్నీని అడిగే ప్రశ్నలివే?
*థియేటర్‌కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు?
*రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
*పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరూ చెప్పలేదా?
*మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
*రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా?
*ఆమె చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
*విషయం తెలిసిన వెంటనే మీరేందుకు థియేటర్ నుంచి వెళ్లలేదు?
*మీ దగ్గర పోలీసులు వచ్చి ఈ విషయం చెప్పారా? లేదా?
*సినిమా ప్రారంభం అయ్యాక కాసేపటికే మీకు విషయం తెలిసినా? ఎందుకు సినిమా చూస్తూనే ఉన్నారు?
*మీతో ఎంత మంది బౌన్సర్లు వచ్చారు?
*ఫ్యాన్స్ పై దాడి చేసిన బౌన్సర్లు వివరాలు ఏంటి? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఆయన పొంతనలేని ఆన్సర్లు చెబితే థియేటర్‌కు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.