- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రీ బస్ వల్ల మాకు సీట్లు దొరకట్లేదు!.. ఆర్టీసీ బస్సుల్లో పురుషుల ఆవేదన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఇటీవల గొడవపడ్డ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు వారికి రిజర్వ్ చేసిన సీట్లే కాకుండా జనరల్ సీట్లలో కూడా మహిళలు వెనుక భాగం వరకు వచ్చి కూర్చుంటున్నారు. దీంతో పురుష ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహిళలకు రిజర్వ్ సీట్లతో పాటు దాదాపు అన్ని సీట్లలో మహిళలే కుర్చుంటున్నారని, తాము టికెట్ కొనుక్కోని నిలబడి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెటింట్లో ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఫ్రీ బస్ వల్ల పురుషులకు బస్సుల్లో సీట్లు దొరకడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు ఇచ్చి కూడా కిలోమీటర్ల కొద్ది నిలబడి పోవాల్సి వస్తుందని వాపోయారు. గత కొన్ని రోజులుగా తమ ఊరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడని, కానీ ఒక్క రోజు కూడా తనకు సీటు దొరకలేదని యువకుడు చెప్పారు. అదే బస్సులో ఓ సీనియర్ సిటిజన్ కూడా సీటు దొరక్క తన ఆవేదన చెప్పుకున్నారు. ఫ్రీ బస్ వల్ల తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సీనియర్ సిటిజన్ చెప్పారు. ఫ్రీ బస్ వల్ల ఎలాంటి లాభం లేదని సీనియర్ సిటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మహిళల రద్ధీ దృష్య బస్సుల సంఖ్య పెంచింది. మరోవైపు పురుష ప్రయాణికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. మరి అది ఎప్పటికీ అమలవుతుందో పురుష ప్రయాణికులు వేచి చూడాలి.