- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సార్! మమ్మల్ని ఏపీకి తీసుకుపొండి.. ఏపీ సీఎం జగన్ కు హోంగార్డుల వినతి
దిశ, వెబ్ డెస్క్: తమలాంటి బతుకులు ఎవరికీ ఉండొద్దని హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపీకి చెందిన హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పోదామంటే సర్వీస్ రూల్స్, ఇక్కడ ఉందామంటే పిల్లల చదువులకు సమస్యలు ఏర్పడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తిపరంగా తమకు తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ తమ పిల్లల చదువుల విషయంలో స్థానికత అడ్డొస్తుందని వాపోయారు. తమ బతుకులు ఎలాగూ అయిపోయాయని, కానీ తమ పిల్లల భవిష్యత్తును తలచుకుంటేనే బాధేస్తుందని అన్నారు.
కన్నవాళ్లకు, సొంత ఊర్లకు దూరంగా ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వైఎస్ జగన్ కే ఓటేశాననే, తమను ఏపీకి తీసుకెళ్తారనే ఆశ ఉందని ఓ హోంగార్డు ఆశాభావం వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ ను హోంగార్డులు కోరారు. ఇంకా తాము ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులను హోంగార్డులు ‘‘దిశ టీవీ’’తో పంచుకున్నారు. అవన్నీ తెలియాలంలే కింది వీడియోను చూడాల్సిందే.