వంద పడకల ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

by Javid Pasha |   ( Updated:2023-03-29 16:49:05.0  )
వంద పడకల ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఓ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్​మ్యానిఫెస్టోలో కూడాపెట్టింది. దీన్ని ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నది. అయితే ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్​లకు మినహాయింపు ఇవ్వనున్నారు. వంద పడకలు లేని చోట కొత్తవి నిర్మాణాలు చేయనుండగా, నియోజకవర్గ స్థాయి హెడ్​ క్వార్టర్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటే, వాటిని అప్​గ్రేడేషన్ పేరిట వంద పడకలకు పెంచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వైద్యారోగ్యశాఖను వివరాలు కోరింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్​విభాగంలో ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రులను నిర్వహించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభైకు పైగా నియోజకవర్గాల్లో కొత్తగా ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే టీవీవీపీలో ప్రణాళిక మొదలు కానున్నది. రెండు మూడు రోజుల్లో ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు.

ఎందుకీ నిర్ణయం..?

రాష్ట్రంలో ఇప్పటికీ చాలా జిల్లాలకు వైద్య సేవలు దూరంగా ఉన్నాయి. దాదాపు నూరుకు పైగా కిలోమీటర్లకు వెళ్తే కానీ సరైన వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఆరోగ్య సేవలు సకాలంలో అదడం లేదు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్​నగర్​, ఆదిలాబాద్​, వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైద్యసేవలు ఆలస్యమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని వలన పేషెంట్ ఎమర్జెన్సీ సమయాన్ని కోల్పోతుండగా, ట్రీట్మెంట్ సరైన సమయంలో అందడం లేదు. దీంతో నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఉండేలా ప్రభుత్వం ప్లాన్​చేస్తున్నది. ఇక టీఆర్​ఎస్​గత ఎన్నికల మ్యానిఫెస్టో లో కూడా పెట్టినందున ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ప్రతీ రోజు వైద్యాధికారులకు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాలపై సర్కార్​దృష్టి సారించింది.

Also Read..

బ్రేకింగ్: సీఎస్ శాంతి కుమారికి మరో అదనపు బాధ్యత


👉 Read Disha Special stories


Next Story

Most Viewed