- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గత ప్రభుత్వంలో అవి లేకనే నిధులు రాలేదు.. ఎంపీ చామల హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో చిత్తశుద్ధితో ఉన్న పాలన కొనసాగుతోందని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై (State Development) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ (Telangana)కు సంబంధించి ముగ్గురు మంత్రులతో (Ministers) పాటు వరంగల్ ఎంపీ కావ్య (Warangal MP Kadiyam Kavya) తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) ని కలిశామని, తెలంగాణకు రావాల్సిన రైల్వే ప్రాజెక్టు (Railway Projects)లపై చర్చించామని తెలిపారు.
ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ (Kajipeta Railway Division) కావాలని కోరడం జరిగిందన్నారు. అలాగే విభజన హామీలలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Railway Coach Factory) కూడా నేరవేర్చాలని కోరామని అన్నారు. అంతేగాక కొన్ని రైల్వే లైన్లకు (Railway Lines) సంబంధించిన ప్రాజెక్టులను కూడా నెరవేర్చాలని, డోర్నకల్ (Dornakal) నుంచి గద్వాల (Gadwala) వరకు రైల్వే లైను, ఆర్ఆర్ఆర్ (RRR) చుట్టూ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాధనను కూడా పెట్టినట్లు వివరించారు. కేంద్రమంత్రితో అన్నీ అంశాలపై చర్చ జరిపామని, రాష్ట్రానికి సంబంధించి ఇదివరకే చాలా ప్రతిపాధనలు వారి దృష్టిలో ఉన్నాయని అన్నారు. వీటితో పాటు తాము మరికొన్ని అంశాలను క్రోడీకరించి ఇచ్చామని, వాటిని కూడా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) పాలన చిత్తశుద్ధి ఉన్న పాలన అని, తెలంగాణ ప్రజా సమస్యల (Telangana Public Issues)పై తమకు చిత్తశుద్ధి ఉన్నదని తెలిపారు. ఇక గత ప్రభుత్వ (Previous Government) హయాంలో కేంద్రంతో సత్సబంధాలు లేకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు (Funds) రాలేదని ఆరోపించారు. వీటన్నింటినీ అధిగమించేందుకే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రజాభవన్ (Praja Bhavan) లో అఖిల పక్ష సమావేశం (All Party Meeting) ఏర్పాటు చేశారని ఎంపీ తెలియజేశారు.