- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Munugode bypoll : ముగిసిన తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ.. బరిలో ఇద్దరు నేతలు
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికకు తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. కాగా, తొలి రోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుండి నాగరాజు అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్‌గా మారం వెంకట్‌రెడ్డి నామివేషన్ వేశారు.
ఇక, మునుగోడు ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 14వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 17 వరకు ఉపసంహరణకు ఛాన్స్ ఉండగా ఆదివారం, రెండో శనివారం, సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ పత్రాలను చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని వెల్లడించారు.